వైస్‌ కెప్టెన్సీ నాకు దక్కిన గౌరవం: రోహిత్‌ శర్మ | Vice-captain I am respected: Rohit Sharma | Sakshi
Sakshi News home page

వైస్‌ కెప్టెన్సీ నాకు దక్కిన గౌరవం: రోహిత్‌ శర్మ

Aug 17 2017 12:10 AM | Updated on Sep 17 2017 5:35 PM

వైస్‌ కెప్టెన్సీ నాకు దక్కిన గౌరవం: రోహిత్‌ శర్మ

వైస్‌ కెప్టెన్సీ నాకు దక్కిన గౌరవం: రోహిత్‌ శర్మ

భారత వన్డే క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు.

పల్లెకెలె: భారత వన్డే క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. తన పదేళ్ల కెరీర్‌లో అతను వన్డే టీమ్‌లో అనేక సార్లు వస్తూ పోతూ ఉండగా, టెస్టు ఫార్మాట్‌ తుది జట్టులో ఇప్పటికీ నిలకడైన స్థానం లేదు. ఇటీవలి శ్రీలంక టెస్టు సిరీస్‌లోనూ రోహిత్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ‘పదేశ్ల క్రితం నేను జట్టుకు ఆడితే చాలనుకునే వాడిని. కానీ ఇప్పుడు అదే జట్టుకు వైస్‌ కెప్టెన్‌ కావడం చాలా గర్వంగా అనిపిస్తోంది ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

ఐపీఎల్‌లో మా జట్టు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించినా అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవం వేరుగా ఉంటుంది. వైస్‌ కెప్టెన్‌గా నా పాత్ర పెద్దగా ఏమీ లేకపోయినా ఈ హోదాలో బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ పదేళ్ల కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఇది ప్రతీ ఆటగాడికి సహజమే. ఆ అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నాను’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement