
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ నేలకుర్తి సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా, పీవీ సింధు, తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు.