టీమిండియాకు పాట్రిక్‌ బైబై

Physio Patrick Emotional Farewell Message After Ends Tenure - Sakshi

మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే భారత్‌ ప్రస్థానం ముగియడంతో జట్టుతో ఫిజియో పాట్రిక్‌ పయనం సైతం ఆగిపోయింది. 2015లో భారత జట్టు ఫిజియోగా పాట్రిక్‌ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం 2019 వరల్డ్‌కప్‌ వరకు మాత్రమే ఆయన కొనసాగాలి. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్‌కప్‌తోనే ఆయన పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ఫిజియోగా తాను తప్పుకొంటున్నట్లు పాట్రిక్‌ గురువారం తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘గత నాలుగేళ్లుగా భారత జట్టుతో నా ప్రయాణం అద్భుతంగా సాగింది. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. టీమిండియా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలి’అని అందులో ఆయన పేర్కొన్నాడు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top