చైనాతో డేవిస్‌ కప్‌ పోరుకు భారత్‌ సై | Davis Cup: Bhupathi confident of a good start | Sakshi
Sakshi News home page

చైనాతో డేవిస్‌ కప్‌ పోరుకు భారత్‌ సై

Apr 6 2018 12:52 AM | Updated on Apr 6 2018 12:52 AM

Davis Cup: Bhupathi confident of a good start - Sakshi

తియాన్‌జెన్‌ (చైనా): ఆసియా ఓసియానియా గ్రూప్‌–1లో భాగంగా భారత్, చైనా జట్ల మధ్య డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ నేడు మొదలవుతుంది. తొలి రోజు సింగిల్స్‌ విభాగంలో వీ బింగ్‌తో రామ్‌కుమార్‌; జీ జాంగ్‌తో సుమిత్‌ ఆడతారు. రెండో రోజు శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో పేస్‌–బోపన్న జంట డి వూ–మావొ జిన్‌ గాంగ్‌ జోడీతో ఆడనుంది.

డబుల్స్‌ మ్యాచ్‌ తర్వాత రెండు రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. డబుల్స్‌ విభాగం లో డేవిస్‌ కప్‌ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుడిగా రికార్డులకెక్కడానికి భారత దిగ్గజం లియాండర్‌ పేస్‌ మరో విజయం దూరంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement