కేఎల్‌ రాహుల్‌.. మళ్లీనా?

Again Fans Troll On KL Rahul Over Wastes Review - Sakshi

డీఆర్‌ఎస్‌ వృథాపై ఫ్యాన్స్‌ ఫైర్‌

రాజ్‌కోట్‌ : టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. గురువారం వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అయితే రాహుల్‌ ఈ వికెట్‌పై సమీక్షకు వెళ్లి మరోసారి విఫలమయ్యాడు. ఇది అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మళ్లీ డీఆర్‌ఎస్‌ వృథా చేశావా? అంటూ మండిపడుతున్నారు. ఇక ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ డీఆర్‌ఎస్‌ వృథా చేయడం మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపింది. అప్పుడే అభిమానుల రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి డకౌట్‌ కావడమే కాకుండా.. రివ్యూను వృథా చేయడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. (చదవండి: వద్దంటే వినాలిగా!!)

దీంతో సోషల్‌ మీడియా వేదికగా రాహుల్‌ను ఏకిపారేస్తున్నారు. ఇక విచారకరమైన విషయం ఏమిటంటే రాహుల్‌ గత 8 ఇన్నింగ్స్‌ల్లో ఎల్బీడబ్ల్యూ లేక బౌల్డ్‌ కావడం. దీంతో అతని ఫుట్‌ వర్క్‌పై సందేహం వ్యక్తం చేస్తూ అతనికి మరోసారి అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మయాంక్‌ అగర్వాల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అతని ఆటపై వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ క్రికెట్‌ కన్నా తన నిర్లక్ష్యాన్నే ఎక్కువగా ప్రేమిస్తాడని, రివ్యూలను వృథా చేయడం ఓ అలవాటుగా మార్చుకున్నాడని కామెంట్‌ చేస్తున్నారు. ( చదవండి: నాన్నకు ప్రేమతో.. : పృథ్వీ షా)

అరంగేట్ర కుర్రాడు పృథ్వీ షా (154 బంతుల్లో 134; 19 ఫోర్లు) దూకుడైన శతకానికి తోడు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (130 బంతుల్లో 86; 14 ఫోర్లు); కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (137 బంతుల్లో 72 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. కోహ్లితో పాటు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (21 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్‌ బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. (చదవండి: పృథ్వీ ‘షా’న్‌దార్‌ )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top