'సీఐడీ విచారణ జరిపిస్తే నిజస్వరూపం తెలుస్తుంది' | Thopudurthi Prakash Reddy Fires On Paritala Sunitha In Anantapur | Sakshi
Sakshi News home page

'సీఐడీ విచారణ జరిపిస్తే నిజస్వరూపం తెలుస్తుంది'

Feb 23 2020 2:01 PM | Updated on Feb 23 2020 2:14 PM

Thopudurthi Prakash Reddy Fires On Paritala Sunitha In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : మంత్రిగా ఉన్న సమయంలో పరిటాల సునీత అనేక అక్రమాలకు పాల్పడ్డారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమె అవినీతిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సునీత తన కుటుంబసభ్యులతో కలిసి వందల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. సీఐడీ విచారణ జరిపిస్తే ఆమె నిజస్వరూపం మొత్తం బయటపడుతుందని, పౌరసరఫలా శాఖ కాంట్రాక్టులన్నీ ఆమె తన బినామీలకే కట్టబెట్టారని మండిపడ్డారు. జంగాలపల్లిలోని ఎఫ్‌సీఐ గోదాంలను నంద్యాలకు మార్చడంతో ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. 
(చంద్రబాబు.. అప్పుడు ఎందుకు జోలె పట్టలేదు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement