‘నాయినికి ఇంతటి అవమానమా’

Revanth Reddy Fires On KCR Over Naini Comments On MLA Ticket - Sakshi

కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం దారుణం

నాయిని వ్యాఖ్యలతో కేసీఆర్‌పై కేసు పెట్టాలి : రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉద్యమకారుడు, నీతి నిజాయితీ అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ నియోజకవర్గానికి 10కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు.  2014 ఎన్నికల్లో ఖర్చుని భరిస్తానని కేసీఆర్‌ నాయినికి హామినిచ్చిన విషయాన్ని స్వయంగా ఆయనే గురువారం మీడియాకు వెల్లడించారని అన్నారు. ముషీరాబాద్‌ సీటును అల్లుడికి ఆశించిన నాయినికి కేసీఆర్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. 

మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ను వెన్నంటి ఉన్న నాయినికి నెలరోజులుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటే అది అవమానం కాదా...? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఎల్బీనగర్‌లో పోటీ చేస్తే 10 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని నాయిని పత్రికాముఖంగా చెప్పారనీ, దీన్ని సుమోటాగా తీసుకుని ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలన్నారు. ఈడీ దాడులు మోడీ, కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top