
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయంతో తెలుగు పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయంతో తెలుగు పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. వైస్సార్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రెడప్పగారి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేశారు. సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శితో పాటు ప్రాధమిక సభ్యత్వానికి తిరుపతికి చెందిన నీలం బాలాజీ రాజీనామా చేశారు. మరికొంత మంది నాయకులు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.