
ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
తూర్పు గోదావరి జిల్లా: ఉప ఎన్నికల్లో మా ఎంపీలు కచ్చితంగా విజయం సాధిస్తారని ఒంగోలు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, ఆమోదించిన వెంటనే ఉప ఎన్నికలకు వెళతామని, విజయం సాధించి ప్రత్యేక హోదా ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి చాటుతామని తెలిపారు. చంద్రబాబు నాయుడికి హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల 12న ప్రారంభమవుతుందని తెలిపారు. 16 నియోజకవర్గాల్లో 275 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని చెప్పారు.