29న ఢిల్లీలో కాంగ్రెస్‌ ర్యాలీ

Congress to organise rally in Delhi on April 29 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిస్థితులు, సమాజంలో అసహనం, ఆందోళనలపై ఢిల్లీలో ఈ నెల 29న నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ తెలిపారు. ఎన్డీఏ నాలుగేళ్ల పాలనలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. వీటికి నిరసనగా రామ్‌లీలా మైదాన్‌ వద్ద ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య సంస్కృతిని దెబ్బతీసిందని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ భావిస్తున్నారని ఆయన చెప్పారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top