
కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జాగ్రాం జిల్లాలో శనివారం రాత్రి బీజేపీ కార్యకర్త రమిన్ సింగ్ హత్యకు గురయ్యారు. తృణమూల్ కార్యకర్తలు సింగ్ ఇంట్లోకి చొరబడి దారుణంగా హతమార్చారని బీజేపీ నేత కైలాష్ విజయ్‌వర్గీయ ఆరోపించారు. మరోవైపు భగవాన్‌పూర్, తూర్పు మిడ్నపూర్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కొందరు కాల్పులకు తెగబడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకూ జరిగిన పలు దశల పోలింగ్ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా బీజేపీ కార్యకర్తలపై తమ పార్టీ శ్రేణులు దాడికి తెగబడ్డాయన్న బీజేపీ నేతల ఆరోపణలను తృణమూల్ నేతలు తోసిపుచ్చారు. ఆరో దశ పోలింగ్‌లో భాగంగా ఆదివారం బెంగాల్‌లోని 8 లోక్‌సభ స్ధానాల్లో పోలింగ్ జరుగుతోంది.