ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

All Party Meeting Start Chaired By PM - Sakshi

ప్రధాని అధ్యక్షతన ప్రారంభమైన సమావేశం

కాంగ్రెస్‌, ఆప్‌, టీడీపీ, టీఎంసీ, డీఎంకే గైర్హాజరు

సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్‌లో జరగుతున్న అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, లోక్ జనశక్తి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్, అకాలీదళ్ అధినేత సుక్ బీర్ సింగ్ బాదల్, పీడీపీ అధినేత్రి మెహబూబా మూర్తి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, సీపీఎం ప్రధాన ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, రాందాస్ అథవాలే తదితరులు పాల్గొన్నారు. 

కాగా ఈ సమావేశానికి కాంగ్రెస్‌ మిత్రపక్షాలతో పాటు.. ఆప్‌, టీడీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలు డుమ్మా కొట్టాయి. అయితే జమిలి ఎన్నికల అంశం బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించిన విషయమని.. ఈ సమావేశానికి తాము హాజరుకాక పోవడమే మంచిదని విపక్షాలు నిర్ణయించాయి. ఏక కాలంలో ఎన్నికలతో పాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top