అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..

Woman Throws 3 Months Sick Son From 4th Floor Of Hospital In Lucknow - Sakshi

లక్నో: అమ్మతనం ఆవిరైంది. అనారోగ్యంతో పుట్టిన పిల్లాన్ని మోయలేక పోయింది. మూడు నెలల చిన్నారి ఉసురు తీసి ‘ఊపిరి’ పీల్చుకుంది. వివరాలు.. మూడు నెలల చిన్నారిని కన్నతల్లే కర్కశంగా హత్య చేసిన అమానవీయ ఘటన లక్నోలో చోటుచేసుకుంది. పుట్టుకతోనే జాండిస్‌, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కొడుకును అక్కున చేర్చుకోవాల్సింది పోయి ఓ అమ్మ రాక్షసంగా ప్రవర్తించింది. చికిత్స చేయిస్తున్నా పిల్లాడి ఆరోగ్యం కుదటపడక పోవడంతో అతన్ని తుదముట్టించాలనుకుంది. బాలుడికి చికిత్సనందిస్తున్న కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యునివర్శిటీ హస్పిటల్‌ భవనం నాలుగో అంతస్తు నుంచి కింద పడేసింది. తీవ్ర గాయాలతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. తొలుత ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని అందరూ భావించారు. అయితే, భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త నిలదీయడంతో చేసిన నేరం ఒప్పుకుంది. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top