ముగ్గురు ఉగ్రవాదులు హతం | Three terrorists gunned down in Wani Hama village in Jammu and Kashmir's Anantnag | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఉగ్రవాదులు హతం

Jul 17 2017 10:14 PM | Updated on Aug 28 2018 7:08 PM

జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్‌ జిల్లాలో గల వానిహమా గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు సోమవారం రాత్రి మట్టుబెట్టాయి.

అనంత్‌నాగ్‌: జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్‌ జిల్లాలో గల వానిహమా గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు సోమవారం రాత్రి మట్టుబెట్టాయి. గ్రామంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో అక్కడి చేరుకున్న బలగాలు వెతుకులాట ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా జవానులపై కాల్పులకు దిగారు. ఇరువురి మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ముగ్గరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టినట్లు సమాచారం అందింది.

హతమైన ముగ్గురు ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రికులపై కాల్పులు జరిపిన వారికి సాయం చేసిన వారిగా భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే పదుల సంఖ్యలో ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement