breaking news
anathnag
-
పుల్వామా ఉగ్రదాడి నిందితుడి హతం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించారు. గాయపడిన మరో ఇద్దరు సైనికులను ఆస్పత్రికి తరలించారు. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో పుల్వామా ఉగ్ర దాడిలో ప్రమేయం ఉన్న సాజద్ భట్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని ఇదే దాడితో సంబంధం ఉన్న అహ్మద్ భట్‌గా గుర్తించారు. సాజద్ బట్ 25 కిలోల పేలుడు పదార్థంతో ఉన్న మారుతి ఈకో కారును పుల్వామా దాడిలో ఉపయోగించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. సోఫీయన్ మదర్సాలో విద్యార్థిగా ఉన్న సాజద్ పుల్వామా దాడికి ముందు కొన్ని రోజలు కనిపిచంకుండా పొయినట్లు ఎన్ఐఏ తెలిపింది. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది సోమవారం హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ రాహుల్ వర్మ మరణించిన విషయం తెలిసిదే. -
ముగ్గురు ఉగ్రవాదులు హతం
అనంత్‌నాగ్: జమ్మూ కశ్మీర్లో అనంత్‌నాగ్ జిల్లాలో గల వానిహమా గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు సోమవారం రాత్రి మట్టుబెట్టాయి. గ్రామంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారనే సమాచారంతో అక్కడి చేరుకున్న బలగాలు వెతుకులాట ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా జవానులపై కాల్పులకు దిగారు. ఇరువురి మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ ముగ్గరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టినట్లు సమాచారం అందింది. హతమైన ముగ్గురు ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై కాల్పులు జరిపిన వారికి సాయం చేసిన వారిగా భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే పదుల సంఖ్యలో ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.