బీజేపీని దింపితేనే.. విద్యుత్‌ శాఖ వివాదాస్పద ప్రకటన | MP Electricity Depts Bizarre Response To Mans Complaint | Sakshi
Sakshi News home page

బీజేపీని దింపి కాంగ్రెస్‌ను గెలిపిస్తే..

May 24 2020 6:24 PM | Updated on May 24 2020 6:34 PM

MP Electricity Depts Bizarre Response To Mans Complaint - Sakshi

మధ్యప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ వ్యవహారశైలితో విద్యుత్‌ వినియోగదారులు విస్తుపోతున్నారు.

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌  ప్రభుత్వ విద్యుత్‌ శాఖ వివాదాస్పద మెసేజ్‌లతో వినియోగదారులు విస్తుపోతున్నారు. తనకు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తికి మీకు కరెంట్‌ బిల్లు తక్కువ (రూ. 100) రావాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి అనే సలహా ఎదురవడంతో సదరు ఫిర్యాదుదారు కంగుతిన్నారు. అగర్‌ మాల్వా జిల్లాకు చెందిన హరీష్‌ జాదవ్‌కు విద్యుత్‌ శాఖ నుంచి రూ 30,000కు పైగా బిల్లు రావడంతో మధ్యప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయనకు వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ఐడీ వచ్చింది. మరుసటి రోజు తన దరఖాస్తు పరిస్థితిని ఆరా తీసేందుకు వెబ్‌సైట్‌లోకి వెళ్లగా ఫిర్యాదు వద్ద క్లోజ్‌డ్‌ అని రాసి ఉంది. ఇక క్లోజింగ్‌ రిమార్స్‌ వద్ద విద్యుత్‌ శాఖ వ్యాఖ్యలు చూస్తే మరింత దిగ్భ్రాంతికి గురిచేశాయి. మీకు బిల్లు తక్కువ రావాలంటే బీజేపీని గద్దెదింపి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురండని అక్కడ రాసివుండటంతో ఫిర్యాదుదారు విస్తుపోయారు.

చదవండి : కొత్త జంట‌కు షాక్‌: వ‌ధువుకు క‌రోనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement