సన్యాసిని రేప్ కేసులోనిందితులు గుర్తింపు | Bengal Nun Gang-Rape: 5 Detained | Sakshi
Sakshi News home page

సన్యాసిని రేప్ కేసులోనిందితులు గుర్తింపు

Mar 15 2015 3:19 PM | Updated on Aug 1 2018 4:24 PM

72 ఏళ్ల సన్యాసినిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.

కోల్ కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కలకలం రేకెత్తించిన 72 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిని గ్యాంగ్ రేప్ చేసిన ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.స్కూలు వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....నిందితులు తెల్లవారు జామున 4 గంటల సమయంలో  సెక్యూరిటీ గార్డును కొట్టి జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లోకి  ప్రవేశించారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా  పోలీసులు వారివద్ద నుంచి రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసును అన్వేషించేందుకు పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

 

గతవారం స్కూలు ప్రిన్సిపల్, విద్యార్థినికి ఒక బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు కోల్ కతా ఆర్చిబిషప్ థామస్ డిసోజా తెలిపారు. ఒకవేళ విద్యార్థిని స్కూలు ఆవరణనుంచి బయటకు వచ్చినట్లైతే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఆ ఫోన్ కాల్ ను పూర్వ విద్యార్థి చేసిందిగా గుర్తించారు. కొంతకాలంగా ఆ విద్యార్థి ఆమెను ఇదేవిధంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇదిలాఉండగా ఈ కేసులో కఠినంగా వ్యవహరిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఘర్ వాపసీ పేరుతో మతహింస పెరిగిందని మమతాబెనర్జీ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement