కరోనా : బీజేపీ నేత ఫైరింగ్ వీడియో వైరల్

Balrampur  BJP leader firing in air during candlelight vigil  - Sakshi

ఐక్యతా దీపానికి బదులుగా, గాల్లోకి కాల్పులు

వైరలవుతున్న బీజేపీ మహిళా నేత వీడియో

సాక్షి, లక్నో : కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా దీపాలు వెలిగించి, ఐక్యతను చాటాలన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  పిలుపునకు భారీ స్పందన లభించింది. మరోవైపు ప్రధాని పిలుపు నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధలను  సైతం ఉల్లఘించి,  వీధుల్లోకి  వచ్చి సామూహిక ర్యాలీలు తీయడం, పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చడం, స్వల్ప అగ్ని ప్రమాదం లాంటి చెదురు మదురు సంఘటనలు కూడా నమోదయ్యాయి. అయితే ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ మహాళానేత వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇంటి బాల్కనీలో దీపం వెలిగించడానికి బదులు, బహిరంగంగా తుపాకీతో  గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

ఆదివారం రాత్రి 9 గంటలకు 9నిమిషాల పాటు కొవ్వొత్తులు, మట్టి ప్రమిద దీపాలు, లేదా మొబైల్ టార్చ్ లైట్ల ద్వారా కరోనా వైరస్  ను అంతమొందించేలా ఐక్యతా దీపాన్ని వెలిగించమని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపునకు బలరాంపూర్‌లోని భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మంజు తివారీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తన సహచరులతో  కలిసి,  తుపాకీతో  గాలిలో కాల్పులు జరిపి సంబరం చేసుకున్నారు. కెమెరాలో బంధించిన ఈ వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీంతో ఈ వీడియో  వైరల్ కావడంతో పలు విమర్శలకు దారి తీసింది. కాగా  కోవిడ్ -19 దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో  మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న విషయం తెలిసిందే.  అయినా  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది.

చదవండి :  దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్ 

కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్ 
లాక్‌డౌన్: మొబైల్ యూజర్లకు ఊరట

 

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top