
ఇక అమితాబ్ 'పద్మవిభూషణ్'
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ జీవితంలో మరో పురస్కారం భాగస్వామి అయింది. బుధవారం ఆయన పద్మవిభూషణ్ సత్కారం అందుకున్నారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ జీవితంలో మరో పురస్కారం భాగస్వామి అయింది. బుధవారం ఆయన పద్మవిభూషణ్ సత్కారం అందుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ విభూషణ్ అవార్డుల అందజేత కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అమితాబ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోసహా పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. అలాగే, సైన్స్, ఇంజినీరింగ్ రంగాల్లో కృషిచేసిన మాలుర్ రామస్వామిశ్రీనివాసన్, వేణుగోపాల్ కూడా ఈ అవార్డును అందుకున్నారు.