వీర జవాన్, పేద కిసాన్‌లకు 2.5 కోట్లు

2.5 crore for Veer jawan and poor kisans - Sakshi

ముంబై: వీర జవాన్‌ కుటుంబాలు, పేద రైతులను ఆదుకునేందుకు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ముందుకు వచ్చారు. అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు రూ.కోటి, రైతుల రుణమాఫీకి మరో రూ.1.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 10’లో భాగంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వివరాల ప్రకారం 44 మంది జవాన్ల కుటుంబాలకు ఈ సహాయం అందుతుందని చెప్పారు.

నిధిలో 60 శాతం జవాన్‌ భార్యకు, మిగిలిన 40 శాతాన్ని తల్లిదండ్రులకు కేటాయించామన్నారు. ‘ఓసారి వైజాగ్‌లో షూటింగ్‌లో ఉన్న సమయంలో రూ.15, 20, 30వేల అప్పు కట్టలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలను చదివి చలించిపోయాను. రైతుల కుటుంబాలకు నా వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. 200 కుటుంబాల రుణమాఫీకి రూ. 1.5 కోట్లు చెల్లిస్తున్నాను’అని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top