ప్రతి సీన్‌లో నవ్వు

Wife I Movie trailer launch - Sakshi

‘ఏడు చేపల కథ’ ఫేమ్‌ అభిషేక్‌ రెడ్డి, సాక్షి నిదియా జంటగా ‘అంతం’ ఫేమ్‌ జి.ఎస్‌.ఎస్‌.పి. కళ్యాణ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైఫై’. లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్‌ఎస్‌పికే స్టూడియోస్‌ పతాకంపై జి. చరితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు వీరభద్రం, నిర్మాత సురేష్‌ కొండేటి విడుదల చేశారు. అభిషేక్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏడు చేపల కథ’ నటుడిగా నాకు మంచి పేరు తీసుకురావడంతో పాటు 4 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ‘వైఫై’ ఎవర్నీ నిరాశ పర్చదు. ప్రతీ సీన్‌లో నవ్వించే ప్రయత్నం చేశాం’’ అన్నారు. ‘‘సమయం కూడా తెలియకుండా సినిమా ఎంజాయ్‌ చేస్తారు ప్రేక్షకులు’’ అన్నారు జి.ఎస్‌.ఎస్‌.పి కళ్యాణ్‌. ‘‘ఇలాంటి కథలు ఈ జనరేషన్‌లో రావాలి.. అందరూ చూడాలి’’ అన్నారు చరితారెడ్డి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top