‘ఇది లిక్కర్‌తో నడిచే బండి’

Rx 100 Fame Kartikeya's New Movie 90ML Teaser Released - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ తరువాత ఆ స్థాయిలో సక్సెస్‌ సాధించలేకపోయాడు. ఇటీవల గ్యాంగ్‌ లీడర్ సినిమాతో ప్రతినాయక పాత్రలో సక్సెస్‌ అయి ఈ యంగ్ హీరో ఇప్పుడు హీరోగా ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 నిర్మాతలు తెరకెక్కించిన 90 ఎంఎల్‌ సినిమాలో దేవదాసు పాత్రలో అలరించనున్నాడు.

ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు చిత్రయూనిట్‌. పూటకో 90 తాగే కేర్‌లేస్‌ కుర్రాడి పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. తన సొంత బ్యానర్‌ కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ సమర్పణలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శేఖర్‌ రెడ్డి ఎర్రా దర్శకు. కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుండగా రవి కిషన్‌, రావూ రమేష్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top