సెట్‌లోకి వెళ్లాలంటే కిక్‌ ఉండాలి

RDX Love Actress Payal Rajput Exclusive Interview - Sakshi

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ అనే సినిమా చేయడానికి ముందు తెలుగు సినిమాల్లోకి రావడానికి నాకు ఆరేళ్లు పట్టింది. చాలా తెలుగు సినిమాలకు ఆడిషన్స్‌ ఇచ్చినా సెలెక్ట్‌ కాలేదు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ సూపర్‌ హిట్‌ కావడంతో ‘ఓవర్‌నైట్‌ స్టార్‌’ అని సంబోధిస్తున్నారు. ‘ఓవర్‌నైట్‌ స్టార్‌’ని కావడం వెనక ఆరేళ్ల కష్టం ఉంది’’ అని పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. పాయల్‌ రాజ్‌పుత్, తేజస్‌ కంచెర్ల జంటగా శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. సి.కల్యాణ్‌ నిర్మాత. ఈ నెల 11న ఈ సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా పాయల్‌ రాజ్‌పుత్‌ చెప్పిన విశేషాలు.

► ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా తర్వాత ఈ స్క్రిప్ట్‌ విన్నాను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కొంచెం బోల్డ్‌గా కూడా ఉంది. ఇలాంటి బోల్డ్‌ సినిమా మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనిపించింది? చేశాను. రొటీన్‌ పాత్రలు కాకుండా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో అలివేలు అనే సోషల్‌ వర్కర్‌ పాత్రలో కనిపిస్తాను. తన ఊరికి వచ్చిన సమస్యను పోరాడి గెలవడానికి అలివేలు ఎంత దూరం వెళ్లిందనేది కాన్సెప్ట్‌.

► ఇందులో నా ఫైట్స్‌ నేనే చేశాను. డూప్‌ పెడతాం అన్నా కూడా నేనే చేస్తాను అని చేశాను.  మోకాలి దగ్గర చిన్న ఫ్రాక్చర్‌ కూడా అయింది (నవ్వుతూ). ఈ సినిమా ద్వారా చాలా పరిమితులను పుష్‌ చేశాను. బయట మాట్లాడటానికి ఇబ్బంది పడే విషయాలను ఈ సినిమాలో చర్చించాం. ఈ సినిమా షూటింగ్‌ నాకు మంచి ఎక్స్‌పీరియన్స్‌. చిన్నప్పుడు ఢిల్లీ, ముంబైలో పెరిగాను. ఈ సినిమా కోసం 45 రోజులు పాపికొండల్లోని ఒక ప్రాంతంలో ఉన్నాం. నా రూమ్‌లోకి అప్పుడప్పుడూ కప్పలు వచ్చేవి. కష్టపడ్డాం అని కంప్లయింట్‌ చేయడం లేదు. ఇదో మంచి జ్ఞాపకం లాంటిది. ప్రతిరోజూ సెట్లోకి వెళ్లాలంటే ఏదో కిక్‌ ఉండాలి. డబ్బు కోసమే సినిమా చేయను.

► తెలుగు సినిమా చేసే ముందు నా మాతృభాష పంజాబీలో కొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలే చేస్తుంటే పంజాబీ ఫ్యాన్స్‌ అందరూ ‘పాయల్‌ పంజాబ్‌’ వచ్చేయ్‌ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో తెలుగు ది బెస్ట్‌ అని నేను భావిస్తున్నాను. బాలీవుడ్‌కి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాను. ప్రస్తుతం ‘వెంకీ మామ, డిస్కో రాజా, ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఓ సినిమా చేస్తున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top