నా వల్ల ఇతర నాయికలు లాభపడుతున్నారు | Other heroines, stars are benefiting, says Kareena Kapoor | Sakshi
Sakshi News home page

నా వల్ల ఇతర నాయికలు లాభపడుతున్నారు

Nov 22 2013 1:23 AM | Updated on Apr 3 2019 6:23 PM

అప్పుడప్పుడు నేను తీసుకునే నిర్ణయాలకు నాలో నేనే నవ్వుకుంటాను. మనకేమైనా పిచ్చా లేక ఏదైనా ప్రాబ్లమా అని కూడా అనుకుంటాను’’ అంటున్నారు కరీనాకపూర్.

‘‘అప్పుడప్పుడు నేను తీసుకునే నిర్ణయాలకు నాలో నేనే నవ్వుకుంటాను. మనకేమైనా పిచ్చా లేక ఏదైనా ప్రాబ్లమా అని కూడా అనుకుంటాను’’ అంటున్నారు కరీనాకపూర్. ఈ అందగత్తె ఇలా తనపై తనే జోక్స్ వేసుకోవడానికి కారణం ఉంది. తన ఇంటివరకూ వచ్చిన అద్భుతమైన అవకాశాల్లో కొన్నింటిని చేతులారా వదులుకున్నారు కరీనా. వాటిల్లో ఇటీవల విడుదలైన ‘రామ్‌లీలా’ ఒకటి. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి విజయవంతమైన చిత్రాలను వదులుకున్నప్పుడు కరీనా పై విధంగా అనుకుంటుంటారట. అలాగే మరో రకంగా కూడా అనుకుంటారామె. దాని గురించి కరీనా చెబుతూ -‘‘బంగారంలాంటి అవకాశాలను వదులుకున్నప్పుడు నేనేమాత్రం ఫీలవ్వను. 
 ఎందుకంటే, జీవితం అప్పుడే అయిపోలేదుగా. అలాంటి అవకాశాలు భవిష్యత్తులో బోల్డన్ని వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే.. నేను వదులుకోవడం ద్వారా ఆ అవకాశాలను వేరే కథానాయికకు ఇస్తున్నాను. ఆ విధంగా వాళ్లు లాభపడుతున్నారు. ‘రామ్‌లీలా’ నేను వద్దనుకున్న తర్వాతే వేరే తారకు వెళ్లింది. సో... నాకు రావాల్సిన విజయం తనకు దక్కింది. కాబట్టి, నాకు ఆనందంగానే ఉంది’’ అని చెప్పారు. ఈ మాటలు విన్నవాళ్లు కరీనా ఓవర్‌గా మాట్లాడుతోందని అంటున్నారు. తనేదో ఉదారస్వభావంతో ఇతర నాయికలకు అవకాశం ఇచ్చినట్లుగా కరీనా మాట్లాడటంపట్ల కొంతమంది నాయికలు గరమ్ గరమ్‌గా ఉన్నారట. వారిలో దీపికా కూడా ఉన్నారని సమాచారం. సందర్భం చూసి, కరీనాకి దీపికా సమాధానం చెబుతుందని, ఆ సమయం త్వరగా వస్తే బాగుండునని ఔత్సాహికరాయుళ్లు ఎదురుచూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement