'నేను శైలజ నా చివరి సినిమా' | nenu sailaja is my last movie: sravanthi ravi kishore | Sakshi
Sakshi News home page

'నేను శైలజ నా చివరి సినిమా'

Jan 12 2016 1:14 PM | Updated on Sep 3 2017 3:33 PM

'నేను శైలజ నా చివరి సినిమా'

'నేను శైలజ నా చివరి సినిమా'

ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రేమంట, మసాల, శివమ్ లాంటి...

ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రేమంట, మసాల, శివమ్ లాంటి డిజాస్టర్ల తరువాత నేను శైలజ సినిమాతో మంచి విజయం సాధించిన స్రవంతి రవికిశోర్, ఈ సినిమా సక్సెస్ మీట్తో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక పై తాను నిర్మాణ రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నానని తెలిపారు.

స్రవంతి రవికిశోర్ నిర్మాణ రంగం నుంచి తప్పుకున్నా.. స్రవంతి మూవీస్ బ్యానర్ మాత్రం కొనసాగుతుందని తెలిపారు. రామ్ సోదరుడు కృష్ణ చైతన్య ఇక పై ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. త్వరలోనే నేను శైలజ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన హీరో రామ్, డైరెక్టర్ కిశోర్ తిరుమలల కాంబినేషన్లో మరో సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు, ఈ సినిమాతోనే కృష్ణ చైతన్య నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement