వాళ్లతో ఎందుకు పని చేయకూడదు?

MeToo Movement Being Blown Out Of Proportion, Says Shatrughan Sinha - Sakshi

‘మీటూ’ ఉద్యమ ప్రభావం వల్ల బాలీవుడ్‌లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు డైరెక్టర్లు వాళ్లు చేస్తున్న సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో వికాస్‌ బాల్, సాజిద్‌ ఖాన్, సుభాష్‌ కపూర్, ముఖేష్‌ చాబ్రాలు ఉన్నారు. ‘మీటూ’ ఉద్యమం గురించి తాజాగా సీనియర్‌ బాలీవుడ్‌ నటుడు శత్రుజ్ఞ సిన్హా స్పందించారు. ‘‘నా 40 ఏళ్ల కెరీర్‌లో ఏ మహిళతోనూ అసభ్యంగా ప్రవర్తించలేదు. ప్రతి మహిళతోనూ చాలా మర్యాదతో నడుచుకుంటున్నాను’’ అన్నారు. మరి.. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుభాష్‌ ఘాయ్‌తో కలిసి మీరు పని చేస్తారా? అంటే.. ‘‘ఎందుకు పని చేయకూడదు. అతను ఇప్పుడు కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నాడు.

అతను దోషిగా తేలినప్పటికీ కలిసి పని చేస్తాను. ఎందుకంటే... అతని తప్పు నిరూపితమైతే ఎలాగూ శిక్ష అనుభవిస్తాడు. అయినా.. సంజయ్‌ దత్‌ దోషిగా తేలి జైలుకు వెళ్లొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కదా?. ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కలిసి పనిచేయమని కొందరు అంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో వాళ్లు హీరోలుగా హైలైట్‌ కావడానికి అలా మాట్లాడుతున్నారేమో?’’ అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న దర్శకుడు సాజిద్‌ ఖాన్‌తో(హౌస్‌ఫుల్‌ 4) వర్క్‌ చేయనని అక్షయ్‌ కుమార్, ‘మొఘల్‌’ సినిమాలో సుభాష్‌ కపూర్‌తో  పని చేయనని ఆమిర్‌ ఖాన్‌ చెప్పిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top