మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం | Megastar Chiranjeevi about Importance of Wearing Mask | Sakshi
Sakshi News home page

మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం

Jul 17 2020 12:50 AM | Updated on Jul 17 2020 1:06 AM

Megastar Chiranjeevi about Importance of Wearing Mask - Sakshi

‘‘మాస్క్‌ను తప్పనిసరిగా ధరించండి. వీలైనన్ని సార్లు  సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోండి. సాంఘిక దూరాన్ని పాటించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలా మీ కుటుంబాన్ని, ఈ దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్‌’’ అంటున్నారు నటుడు చిరంజీవి. కరోనా వైరస్‌పై ప్రజలను మరింత చైతన్యపరిచేందుకు హీరోలు చిరంజీవి, కార్తికేయ, హీరోయిన్‌ ఈషా రెబ్బాలు కలిసి రెండు వీడియోలను విడుదల చేశారు. ఒక వీడియోలో మీసం మెలేస్తుంటారు కార్తికేయ. అప్పుడు చిరంజీవి... ‘‘మీసం మెలేయడం వీరత్వమే. కానీ అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ముఖానికి మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం’’ అని తనదైన స్టయిల్‌లో అంటే, ‘ఓకే బాస్‌’ అంటూ మాస్క్‌ను ధరిస్తారు కార్తికేయ.

మరో వీడియోలో లిప్‌స్టిక్‌ వేసుకుంటుంటారు ఈషా రెబ్బా. అప్పుడు చిరంజీవి ‘‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే ముఖానికి మాస్క్‌ ధరించడం ఎంతో అవసరం’’ అంటారు. ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి ఈ వీడియోలో నటించారు. ‘‘ఆలోచనను పంచుకోగానే ముందుకు వచ్చిన కార్తికేయ, ఈషా రెబ్బా, చేతన్‌ భరద్వాజ్‌లకు ధన్యవాదాలు. మీకు ఉన్న సామాజిక స్పృహ అభినందనీయం’’ అని పేర్కొన్నారు చిరంజీవి. ‘‘ఓ మంచి కారణం కోసం చిరంజీవిగారితో కలిసి వీడియో చేశాను. నా సినిమాలు పది విడుదలైనా నాకు ఇంత కిక్‌ రాదు. నాకిది లైఫ్‌ టైమ్‌ మెమొరీ’’  అన్నారు కార్తికేయ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement