మాలిని వచ్చేస్తోంది! | Malini And Co Set For Release On 24th July | Sakshi
Sakshi News home page

మాలిని వచ్చేస్తోంది!

Jul 12 2015 11:05 PM | Updated on Aug 17 2018 2:24 PM

మాలిని వచ్చేస్తోంది! - Sakshi

మాలిని వచ్చేస్తోంది!

పూనమ్ పాండే ఇప్పటివరకూ తెలుగు చిత్రాల్లో నటించకపోయినప్పటికీ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యల ద్వారా ఇక్కడ కూడా బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్నారు.

 పూనమ్ పాండే ఇప్పటివరకూ తెలుగు చిత్రాల్లో నటించకపోయినప్పటికీ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యల ద్వారా ఇక్కడ కూడా బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్నారు. త్వరలో ఆమె మాలినిగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. పూనమ్‌పాండే, మిన్ ముఖ్యతారలుగా వీరు.కె దర్శకత్వంలో మహేశ్ రాఠి నిర్మించిన చిత్రం ‘మాలిని అండ్ కో’. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కచ్చితంగా అందరినీ అలరించే చిత్రం అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సహ  నిర్మాత: రవిహార్ కూట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement