పాంచ్‌ పటాకా

katherine theresa five movies releasing in 2019 - Sakshi

గతేడాది సిల్వర్‌ స్క్రీన్‌ మీద ఒక్కసారే కనిపించారు క్యాథరీన్‌. అదీ తమిళ చిత్రం ‘కలకలప్పు 2’లో. 2018లో తనను స్క్రీన్‌ మీద బాగా మిస్‌ అయిన ఫ్యాన్స్‌కు ఈ ఏడాది పాంచ్‌ పటాకా ఇవ్వనున్నారు. ఈ ఏడాది క్యాథరీన్‌కు 5 రిలీజులున్నాయి. ‘అత్తారింటì కి దారేది’ తమిళ రీమేక్‌ ‘వందా రాజావాదాన్‌ వరువేన్‌’లో హీరోయిన్‌గా చేస్తున్నారు. ‘నీయా’ సీక్వెల్‌ ‘నీయా 2’, ‘అరువమ్‌’, ఏడేళ్ల తర్వాత మలయాళంలోకి కమ్‌బ్యాక్‌ ఇస్తూ చేసిన ‘అన్నెకిల్లమ్‌ అల్లెన్‌కిల్లమ్‌’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి.

ఇంకా తెలుగులో సంతోష్‌ శివన్, రవితేజ కాంబినేషన్‌లో చేయనున్న సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యారు. ఇవే కాకుండా విజయ్‌ దేవరకొండ సినిమాలోనూ చాన్స్‌ కొట్టేశారని టాక్‌. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశీఖన్నా, తమిళ భామ ఐశ్వర్యా రాజేశ్, బ్రెజిల్‌ మోడల్‌ ఇసబెల్లా హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా క్యాథరీన్‌ కూడా ఎంపికైనట్టు సమాచారం. మొత్తానికి గతేడాది వచ్చిన గ్యాప్‌ని ఈ ఏడాది గ్యాప్‌ లేకుండా సినిమాలతో నింపేసినట్టున్నారు క్యాథరీన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top