సూసైడ్‌ చేసుకుంటా.. కేఆర్కే వార్నింగ్‌! | Kamaal R Khan Threatens To Commit Suicide | Sakshi
Sakshi News home page

Nov 2 2017 7:42 PM | Updated on Nov 6 2018 8:28 PM

Kamaal R Khan Threatens To Commit Suicide - Sakshi

తనను తాను విమర్శకుడిగా చెప్పుకుంటూ.. నిత్యం సినీ ప్రముఖులపై నోరుపారేసుకునే కమల్‌ ఆర్‌ ఖాన్‌ అలియాస్‌ కేఆర్కేకు ఇటీవల గట్టి షాక్‌ తగిలిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలపై విరుచుకుపడే  కేఆర్కేకు ట్విట్టర్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. పెద్దసంఖ్యలో అభిమానులూ ఉన్నారు. అయితే, ఇటీవల వచ్చిన ఆమిర్‌ఖాన్‌ సినిమా ’సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’పై కేఆర్కే తనదైన శైలిలో నోరుపారేసుకున్నాడు. ఈ సినిమాను సమీక్షిస్తూ.. ఏకంగా క్లైమాక్స్‌ను వెల్లడించాడు. అంతేకాకుండా ఆమిర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడు.

’నువ్వు మంచి తండ్రివి కాకపోయినంతమాత్రాన లేదా, నువ్వు గౌరవించని నీ తండ్రి మంచి నాన్న కాకపోయినంత మాత్రాన మేం పిల్లలను ప్రేమించమని చెప్పకు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత కేఆర్కేకు గట్టి షాక్‌ తగిలింది. ఆయన ట్విట్టర్‌ ఖాతా రద్దయిపోయింది. ఆమిర్‌ ఖాన్‌ ఫిర్యాదు కారణంగానే ట్విట్టర్‌ ఆయన ఖాతాను తొలగించిందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా కేఆర్కే ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. 15 రోజుల్లో ట్విట్టర్‌లో తన ఖాతాను పునరుద్ధరించకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.

’15 రోజుల్లో నా ఖాతాను పునరుద్ధరించాల్సిందిగా ట్విట్టర్‌ ఇండియా, ట్విట్టర్‌ సిబ్బంది అయిన మహిమ కౌల్‌, విరాల్‌ జాని, తరణ్‌జీత్‌ సింఘ్తోలకు విజ్ఞప్తి చేస్తున్నా. మొదట నా మీద వారు మిలియన్లకొద్దీ డబ్బును చార్జ్‌ చేశారు. తర్వాత నా ఖాతాను సస్పెండ్‌ చేశారు. వారు నన్ను మోసం చేయడంతో నేను కుంగిపోయాను. నా ఖాతాను పునరుద్ధరించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా మృతికి వీరే కారణం. ఇట్లు ఒత్తిడిలో ఉన్న కేఆర్కే’ అంటూ ఆయన ప్రతిక ప్రకటనను విడుదల చేశారు.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement