కాస్టింగ్‌ కౌచ్‌పై ఇలియానా.. | Ileana D'Cruz Opens Up On Casting Couch In Bollywood | Sakshi
Sakshi News home page

కాస్టింగ్‌ కౌచ్‌పై ఇలియానా..

Mar 13 2018 3:25 PM | Updated on Apr 3 2019 6:34 PM

Ileana D'Cruz Opens Up On Casting Couch In Bollywood - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాస్టింగ్‌ కౌచ్‌పై దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు మళ్లిన హీరోయిన్‌ ఇలియానా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం హీరోయిన్లపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఇటీవల పలువురు గళమెత్తడంపై ఇలియానా స్పందించారు. అజయ్‌ దేవ్‌గన్‌తో తాను నటించిన రైడ్‌ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బాంబే టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్‌ కౌచ్‌పై తన అభిప్రాయం వెల్లడించారు. సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న ఈ దారుణంపై మాట్లాడితే తమ కెరీర్‌లు ముగిసిపోతాయనే భయంతో పలువురు హీరోయిన్స్‌ నోరు మెదపడం లేదనే అభిప్రాయంతో ఆమె ఏకీభవించారు.

‘కాస్టింగ్‌ కౌచ్‌పై ఎవరైనా మాట్లాడితే వారి కెరీర్‌ ముగిసినట్టే’ నని ఇలియానా వ్యాఖ్యానించారు. ఓ పెద్ద నిర్మాత తనను వేధిస్తున్నారని కొన్నేళ్ల కిందట దక్షిణాదిలో ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ తనతో వాపోయారని, ఆయనను ఎలా ఎదుర్కోవాలని తనను అడిగారని ఇలియానా చెప్పుకొచ్చారు. అయితే దీనిపై తాను చెప్పేదేమీలేదని.. నీవే నిర్ణయించుకోవాలని సూచించానన్నారు.

ఇలాంటి సందర్భాల్లో ముందుకెళ్లాలా.. ప్రతిఘటించాలా అన్నది నటులే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. అయితే హీరోయిన్లపై వేధింపులు, అణిచివేతను మాత్రం తాను ఎంతమాత్రం సమర్ధించనని చెప్పారు. బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో తన సంబంధాలపై ఇలియానా స్పందిస్తూ తన వ్యక్తిగత జీవితంపై తాను మాట్లాడబోనని అన్నారు. సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తిగత విషయాలు పంచుకుంటానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement