
యంగ్ హీరో అడివి శేష్ వరుసగా రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో మొదటగా ‘గూఢచారి’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఆ మధ్య విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. ఇక ఎప్పటికప్పుడు షూటింగ్ అప్ డేట్లు ఇస్తున్న శేష్.. షూటింగ్ ముగిసినట్లు ప్రకటించాడు.
‘లేడీస్ అండ్ జెంటిల్మెన్... గూఢచారి షూటింగ్ పూర్తయ్యింది. రేపు మేజర్ అనౌన్స్‌మెంట్’ అంటూ కాసేపటి క్రితం ఓ ట్వీట్ చేశాడు. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో కస్టమ్ అధికారి రవి పట్నాయక్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శశికిరణ్ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ద్వారా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార‍్లగడ్డ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు టూ స్టేట్స్ రీమేక్ షూటింగ్‌లో కూడా అడివి శేష్ పాల్గొంటున్నాడు. రాజశేఖర్ కూతురు శివాని ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.
#Goodachari shoot has wrapped ladies & Gentlemen! Major announcement tomorrow!
— Adivi Sesh (@AdiviSesh) 14 June 2018