తానే స్టార్‌హీరోనంటూ డూప్‌ హల్‌చల్‌!! | Bradley Cooper look-alike crashes Sundance parties | Sakshi
Sakshi News home page

తానే స్టార్‌హీరోనంటూ డూప్‌ హల్‌చల్‌!!

Jan 27 2016 9:21 AM | Updated on Sep 3 2017 4:25 PM

తానే స్టార్‌హీరోనంటూ డూప్‌ హల్‌చల్‌!!

తానే స్టార్‌హీరోనంటూ డూప్‌ హల్‌చల్‌!!

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెప్తారు.

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెప్తారు. ఇక సినిమా స్టార్లతో పోలికలున్న ఉన్న వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లలాగా నటించి, డైలాగులు చెప్పి, డ్యాన్సులు చేసి టీవీ షోల్లో ఈ పోలికలున్న డూప్ వ్యక్తులు అప్పుడప్పుడు అలరిస్తు ఉంటారు. ఇందులో ఏ సమస్య లేదు. కానీ అచ్చుగుద్దినట్టు పోలికలుండటంతో తానే అసలు స్టార్‌ హీరోనంటూ ఓ డూప్‌ వ్యక్తి ప్రజలను మభ్యపెట్టి బోల్తా కొట్టిస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా ఇలాంటి సమస్య హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్లే కూపర్‌కు ఎదురైంది. అచ్చుగుద్దినట్టు కూపర్‌ పోలికల్లో ఉండే ఓ వ్యక్తి.. ఇటీవల జరిగిన 2016 సండాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో హల్‌చల్ చేశాడు. తానే కూపర్‌ నంటూ సెక్యూరిటీని మభ్యపెట్టి యథేచ్ఛగా ఈ చిత్రోత్సవంలోకి ప్రవేశించిన అతను.. కూపర్‌ అభిమానులతో ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు. ఈ ఫొటోలు చూసి అసలు కూపర్‌కు దిమ్మదిరిగినంత పనయిందట.

అంతేకాదు కూపర్‌కు జీరాక్స్ కాపీలా ఉండే ఆ వ్యక్తి తరచూ ఆయన పేరు వాడుకొని సెలబ్రిటీ పార్టీల్లోకి చొరబడుతున్నాడట. తానే కూపర్‌లా పోజు కొడుతూ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నాడు. ఉటాలో సండాన్స్‌ చిత్రోత్సవం జరిగే సమయంలో కూపర్ న్యూయార్క్‌ లో ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన నకిలీ కూపర్‌ ఈ వేడుకల్లోకి చొరబడ్డాడని భావిస్తున్నారు. అమెరికన్ యాక్టర్ అయిన కూపర్‌ 'బర్న్‌ట్‌', 'అమెరికన్ స్నిపర్', 'సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌' వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement