'బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్' అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే! | best indian dancer search in google we observe amazing information | Sakshi
Sakshi News home page

'బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్' అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే!

Feb 1 2017 7:26 PM | Updated on Sep 5 2017 2:39 AM

టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డాన్సర్ అనే విషయంపై చాలాసార్లు హీరోల అభిమానులు వాదులాడుతుంటారు.

టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డాన్సర్ అనే విషయంపై చాలాసార్లు హీరోల అభిమానులు వాదులాడుతుంటారు. కొందరైతే జూనియర్ ఎన్టీఆర్ టాప్ అని, మరికొందరు అల్లు అర్జున్, రామ్ చరణ్ అని హీరోలు ఎవరూ కాదు.. డ్యాన్స్ కింగ్స్ ప్రభుదేవా, లారెన్స్ అని చెబుతుంటారు. ఈ విషయాలపై ఓ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ఓ ఆసక్తికర విషయం వెల్లడవుతుంది. 'బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్' అని సెర్చ్ బాక్స్‌లో టైప్ చేయగానే వచ్చే పేరుతో కొందరు షాక్ తినగా, ఓ హీరో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు లిస్ట్‌లో అగ్ర స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌ను, డాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా, లారెన్స్‌లను సైతం వెనక్కి నెట్టేస్తున్నాడు ఎన్టీఆర్.

ఈ టాప్ టెన్ జాబితాలో ముగ్గురు టాలీవుడ్ హీరోలుండగా, ఎన్టీఆర్, అల్లు అర్జున్ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పదో స్ధానంలో నిలిచారు. టాప్ డ్యాన్సర్స్ జాబితాలో మాధురి దీక్షిత్, ఐశ్వర్యరాయ్ ఉండటం విశేషం. 'బెస్ట్ ఇండియన్ డ్యాన్సర్' అని గూగుల్‌లో సెర్చ్ చేయగా టాప్‌ టెన్‌ జాబితా ఇలా కనిపిస్తుంది.
1. జూనియర్ ఎన్టీఆర్
2. హృతిక్ రోషన్
3. అల్లు అర్జున్
4. ప్రభుదేవా
5. లారెన్స్
6. మాధురి దీక్షిత్
7. విజయ్(తమిళం)
8. రాఘవ్ క్రోక్‌రోజ్
9. ఐశ్వర్యరాయ్
10. చిరంజీవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement