రామ్ లీలా ప్రదర్శనను అడ్డుకున్న భజరంగ్ దళ్!
బాలీవుడ్ చిత్రం రామ్ లీలా కు బజరంగ్ దళ్ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది.
బాలీవుడ్ చిత్రం రామ్ లీలా కు బజరంగ్ దళ్ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. రామ్ లీలా చిత్రంలోని సన్నివేశాలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో ప్రదర్శనను భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఐదు సినిమా హాల్స్ లో రామ్ లీలా ప్రదర్శనను అడ్డుకున్నట్టు ఇండోర్ బజరంగ్ దల్ డివిజన్ కన్వీనర్ తెలిపారు. ఈ చిత్రంలో అనేక అశ్లీల సన్నివేశాలున్నాయని, హనుమాన్ డ్యాన్స్ హిందువుల మనోభావాల్సి దెబ్బతీసే విధంగా ఉందని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాంతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సినిమా హాల్స్ కు పోలీసులు భద్రత కల్పించారు.
దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు నటించిన రామ్ లీలా చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబర్ 15 తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.