
సాక్షి, జోధ్‌పూర్ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటిన జోధ్‌పూర్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బిగ్ బీకి చికిత్స అందిచడానికి ముంబయి నుంచి జోధ్‌పూర్‌కి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాకి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయకిగా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.