గ్యాంగ్‌స్టర్‌ గంగూభాయ్‌

Alia Bhatt to star in Sanjay Leela Bhansali Gangubai Kathiawadi - Sakshi

త్వరలో ముంబై గ్యాంగ్‌స్టర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారు బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్‌ లీడ్‌ రోల్‌లో ‘గంగూభాయ్‌ కతియవాడి’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అధికారిక ప్రకటన బుధవారం వెల్లడైంది. ఓ పాత్రికేయురాలు రాసిన ఓ బుక్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... సల్మాన్‌ఖాన్, ఆలియా భట్‌ హీరో హీరోయిన్లుగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘ఇన్‌షా అల్లా’ చిత్రం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ‘ఇన్‌షా అల్లా’ సెట్స్‌పైకి వెళ్లకపోవడంతో ఆలియా చాలా బాధపడ్డారని, ఈ కారణం చేతనే ఆలియాతో భన్సాలీ ఈ లేడీ ఓరియంటెడ్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top