ఖాన్‌లను వెనక్కి నెట్టిన ‘ఖిలాడీ’

Akshay Kumar Top With Endorsements With Rs 100 Crore In 2018 - Sakshi

బాలీవుడ్‌ ‘ఖిలాడీ’ అక్షయ్‌ కుమార్‌.. ఖాన్‌ల త్రయాన్ని వెనక్కి నెట్టేశారు. కమర్షియల్స్‌ ద్వారా వచ్చే ఆదాయం విషయంలో అక్షయ్‌ ముగ్గురు ఖాన్‌ల కంటే ముందున్నారు. సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీకి చాలా పెద్ద పీట వేస్తారు. ఒక్క సినిమా మంచి విజయం సాధిస్తే చాలు.. అవకాశాలతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.  ఒక్క సారి పేరు వస్తే చాలు.. ఆదాయం సంపాదించటానికి ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటారు సెలబ్రిటీలు. సినిమాలతో పాటు టీవీ కమర్షియల్స్‌, బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ.. కోట్లలో పారితోషికం తీసుకుంటారు. (చదవండి : ఇదేంది అక్షయ్‌.. ఇట్లా చేస్తివి!?)

అలా యాడ్‌ ఫిలింస్‌‌, కమర్షియల్స్‌కు అత్యధిక పారితోషికం తీసుకునేవారిలో అక్షయ్‌ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం అక్షయ్‌ చేతిలో రూ.100 కోట్లు విలువ చేసే కమర్షియల్స్‌ ఒప్పందాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.84 కోట్లు), మూడో స్థానంలో ఆయన భార్య దీపికా పదుకొనే (రూ.75 కోట్లు) ఉన్నారు.

టాప్‌ 10లో మిగతా సెలబ్రిటీలు ఏవరంటే..
4. అమితాబ్ బచ్చన్‌ (రూ.72 కోట్లు)
5. ఆలియా భట్‌ (రూ.68 కోట్లు)
6. షారుఖ్‌ ఖాన్‌ (రూ.56 కోట్లు)
7. వరుణ్‌ ధావన్‌ (రూ.48 కోట్లు)
8. సల్మాన్‌ ఖాన్‌ (రూ. 40 కోట్లు)
9. కరీనా కపూర్‌ (రూ.32 కోట్లు)
10. కత్రినా కైఫ్‌ (రూ.30 కోట్లు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top