
గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో సీక్వెల్‌ల హవా నడుస్తోంది. కొత్త కథతో కుస్తీ పట్టేకంటే ఆల్రెడీ హిట్టైన స్టోరీనే అటూ ఇటూ మార్చి సీక్వెల్‌గా చుట్టేయవచ్చు. దీంతో బిజినెస్ కూడా పెంచుకోవచ్చని దర్శక నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘గూఢచారి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అడవి శేష్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు సిద్ధమవుతోంది.
అడవి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సీక్వెల్ గురించి అధికార ప్రకటన చేశారు యూనిట్. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. 2019 మధ్యలో గూఢచారి 2 షూటింగ్ మొదలు కానుంది. గూఢచారి రెండో భాగం భారీ బడ్జెట్.. అద్భుతమైన లొకేషన్స్.. పెద్ద స్కేల్లో రాబోతుంది. తొలి భాగం కంటే మంచి ఔట్ పుట్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. గూఢచారి సినిమా స్క్రిప్ట్ వర్క్ లో అసిస్టెంట్ గా ఉన్న రాహుల్ పాకాల గూఢచారి 2కు దర్శకత్వం వహిస్తున్నాడు. 2020లో ఈ సీక్వెల్ విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనుంది.
Thank you for the lovely wishes
— Adivi Sesh (@AdiviSesh) December 17, 2018
😊 Scripting begins for a
Bigger.
Badder.
Better. #Goodachari2 #Goodachariwillbeback @peoplemediafcy @vivekkuchibotla @AnilSunkara1 @AKofficiial @AAArtsOfficial @AbhishekOfficl @RahulPakala pic.twitter.com/JInm8l7cSA