
లండన్ : దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్‌కు చెందిన భారత సంతతికి చెందిన కరణ్ సింగ్(23)కు క్రోయిడాన్ క్రౌన్ కోర్టు 8 నెల జైలు శిక్ష విధించింది. గంజాయితో పట్టుబడ్డ కరణ్ సింగ్‌ను మార్చి 14న పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ కేసును విచారించడానికి వచ్చిన అధికారిపై బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ఆయన ముఖంపై కరణ్ సింగ్ ఉమ్మేశాడు. అంతేకాకుండా తనకు కరోనా ఉందని అబద్ధం ఆడాడు.
అత్యవసర సమయాల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిపై ఉమ్మివేయడం అనైతికమని, ఆమోదయోగ్యం కాదని మెట్రోపాలిటన్ పోలీస్ సౌత్ ఏరియా కమాండ్ సూపరిండెంట్ డాన్ నోలెస్ అన్నారు. ఈ ఘటన అనంతరం జైలు సెల్ నుంచే అతడిని మరోసారి విచారించగా, ఒత్తిడికి గురై కోపంతో అలా చేశానని, అధికారులు తనను క్షమించాలని కోరాడు. గంజాయితో పట్టుబడటమే కాకుండా విచారణ అధికారిపై ఉమ్మేసి, తనకు కరోనా ఉందని భయబ్రాంతులకు గురిచేసినందుకు గానూ కరణ్ సింగ్‌కు కోర్టు మొత్తం 8 నెలల జైలు శిక్ష విధించింది.