పదేళ్లయినా పాడవని బర్గర్‌! | Iceland Live Stream Ten Year Old McDonalds Cheeseburger | Sakshi
Sakshi News home page

పదేళ్లయినా పాడవని బర్గర్‌!

Nov 6 2019 11:45 PM | Updated on Nov 6 2019 11:45 PM

Iceland Live Stream Ten Year Old McDonalds Cheeseburger - Sakshi

రేక్జవిక్‌ : బర్గర్లు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? మహా అయితే రెండ్రోజులు. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్నవి ఏకంగా పదేళ్లయినా పాడవలేదు! ఆశ్చర్యంగా ఉందా? అయితే, ఇది చదవండి. బర్గర్లు, పీజాల తయారీలో ప్రసిద్ధి చెందిన మెక్‌డొనాల్డ్‌ కంపెనీ ఐస్‌లాండ్‌లో 2009లో తన చివరి అవుట్‌లెట్‌ను మూసివేసింది. అయితే, చివరగా హిజోర్టర్‌ స్మెర్సెన్‌ అనే వ్యక్తి ఆ షాప్‌లో ఫ్రెంచ్‌ ఫ్రైస్, ఓ బర్గర్‌ కొన్నాడు. అయితే అతను ఈ వాటిని తినేందుకు బదులు, మెక్‌డొనాల్డ్‌ గుర్తుగా అలానే ఉంచుకోవాలనుకున్నాడు. మొదట్లో అతను వీటిని తన దగ్గర నిల్వ చేశాడు. తరువాత నేషనల్‌ మ్యూజియంకు అప్పగించాడు. ఇప్పుడు వాటిని ఒక హోటల్‌లో భద్రపరిచారు. అయితే, సుమారు పదేళ్లయినా ఇప్పటికీ అవి తాజాగా ఉన్నాయి. దీని గురించి తెలుసుకున్న వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. కాగా వీటి గురించి ఫుడ్‌సైన్స్‌కు చెందిన ఒక ప్రొఫెసర్‌ మాట్లాడుతూ తేమ ఏమాత్రం లేనందునే అవి తాజాగా ఉన్నాయని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement