జీవరసాయన ఆయుధాల దాడి జరగొచ్చు! | French PM Manuel Valls Says Chemical Warfare Risk Not Ruled Out | Sakshi
Sakshi News home page

జీవరసాయన ఆయుధాల దాడి జరగొచ్చు!

Nov 19 2015 3:55 PM | Updated on Sep 17 2018 7:44 PM

కరుడుగట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జీవరసాయన ఆయుధాలతో దాడికి పాల్పడే అవకాశం ఉందని గురువారం ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయల్ వాల్స్ అభిప్రాయపడ్డారు.

పారిస్: కరుడుగట్టిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జీవరసాయన ఆయుధాలతో దాడికి పాల్పడే అవకాశం ఉందని గురువారం ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయల్ వాల్స్ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడుల నేపథ్యంలో గురువారం ఫ్రెంచ్ పార్లమెంట్ దిగువ సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'ఉగ్రవాదుల నుండి జీవరసాయన దాడులు జరిగే అవకాశం ఉంది. రసాయనాలు లేదా బాక్టీరియాతో ఉగ్రవాదులు ఫ్రాన్స్పై దాడి జరపొచ్చు. ఇలాంటి దాడుల నుండి బయటపడటానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మనం ఏ విషయాన్ని తోసిపుచ్చలేం' అన్నారు.

దాడుల నేపథ్యంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని పొడగించడానికి పార్లమెంట్ అనుమతి కోరారు. భయంకరమైన దాడులకు ఊహించలేనన్ని అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారని మాన్యుయల్ వాల్స్ తెలిపారు. ఈ విషయాలను మనసులో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement