కార్లతో సహా కొట్టుకుపోయారు | Fifteen killed in Utah flash floods | Sakshi
Sakshi News home page

కార్లతో సహా కొట్టుకుపోయారుట

Sep 16 2015 8:15 AM | Updated on Sep 3 2017 9:31 AM

కార్లతో సహా కొట్టుకుపోయారు

కార్లతో సహా కొట్టుకుపోయారు

అమెరికాలో భారీ వరదలు సంభవించి 15మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పన్నెండు మంది రెండు కుటుంబాలకు చెందిన వారు.

లాస్ ఎంజెల్స్: అమెరికాలో భారీ వరదలు సంభవించి 15మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పన్నెండు మంది రెండు కుటుంబాలకు చెందిన వారు. వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళుతుండగా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉతాహ్ ప్రాంతంలో పోటెత్తిన వరదల్లో చిక్కుకున్నారు. వరద నీరు బలంగా వచ్చి వాహనాలు ఢీకొనడంతోపాటు ఈడ్చుకెళ్లడంతో వారు అందులోనే ప్రాణాలు విడిచారు.

అయితే, అవే కార్లలోని ఓ ముగ్గురు మాత్రం బతికి బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న తమ వాహనాలు తిరిగి వెనక్కు తీసుకెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా అప్పటికే నీటి ప్రవాహం పెరిగి వారు వాహనాలతో సహా కొట్టుకుపోయారు. ఇప్పటికే అక్కడి పలు నదులు ప్రమాధ స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement