హైదరాబాద్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి | Three arrested for rape of hyderabad rajendra nagar | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి

Feb 2 2015 9:36 PM | Updated on Aug 20 2018 4:27 PM

హైదరాబాద్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి - Sakshi

హైదరాబాద్లో ఇద్దరు మహిళలపై లైంగిక దాడి

హైదరాబాద్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు ఇద్దరు మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం జరిగింది. నగరంలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు ఇద్దరు మహిళలపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

రాజేంద్రనగర్లోని ఎన్టీఆర్ నగర్లో ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నగరంలోనే వనస్తలిపురంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి వివాహితపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు యువతిని బలవంతంగా తన గదికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement