సీనియర్ అసిస్టెంట్ ఖాతాలో కోట్ల సొమ్ము | senior assistant aravindaraju fraud with employees money | Sakshi
Sakshi News home page

సీనియర్ అసిస్టెంట్ ఖాతాలో కోట్ల సొమ్ము

Jul 22 2017 12:06 PM | Updated on Sep 5 2017 4:38 PM

ఓ సీనియర్ అసిస్టెంట్ కోట్లు రూపాయలను తన ఖాతాలో వేసుకుని అక్రమాలకు పాల్పడ్డాడు.

హైదరాబాద్: ఉద్యోగుల సొమ్మును తన ఖాతాలో వేసుకుని అక్రమాలకు పాల్పడిన రాజేంద్రనగర్ ఎస్టాబ్లిష్‌మెంట్ సీనియర్ అసిస్టెంట్  కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఉద్యోగులకు చెందిన జీతాల డబ్బు రూ.1.3 కోట్లను సీనియర్ అసిస్టెంట్ అరవిందరాజు తన ఖాతాలో వేసుకుని భారీ అక్రమాలకు తెరలేపాడు. ఉద్యోగుల పీఎఫ్, ఎల్‌ఐసీ కట్టకుండా గత కొన్ని నెలలుగా మోసాలకు పాల్పుడుతున్నాడు.

డిప్యూటీ కమిషనర్ విజయలక్ష్మి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసులకు భయపడ్డ అరవిందరాజు రెండ్రోజుల క్రితం కోర్టులో లొంగిపోయాడు. మోసపోయిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు నిందితుడి వద్ద ఉన్న నగదు వివరాలపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement