'రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది' | sailajanath takes on chandrababu | Sakshi
Sakshi News home page

'రాష్ట్రంలో నియంత పాలన సాగుతోంది'

Jun 15 2016 1:40 PM | Updated on Mar 19 2019 5:47 PM

ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నియంతపాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఆరోపించారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నియంతపాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో ఎస్ .శైలజానాథ్ విలేకర్లతో మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చేశారని విమర్శించారు. కాపు నేతలను ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సాక్షి టీవీ ప్రసారాలను నిలిపి వేయడం అప్రజాస్వామికమని శైలజనాథ్ పేర్కొన్నారు. రాజధాని అమరావతిని సింగపూర్కు 99 ఏళ్లు లీజుకివ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులు అమరావతికి రాకపోతే స్థానికత వర్తించదంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చంద్రబాబుపై శైలజానాథ్ నిప్పులు చెరిగారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement