ఫిబ్రవరిలో విస్తృతస్థాయి సమావేశం

Extensive meeting in February - Sakshi

జేఏసీ చైర్మన్‌ కోదండరాం 

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించడానికి ఫిబ్రవరి 3వ తేదీ లేదా 4వ తేదీన విస్తృతస్థాయి సమా వేశం నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. రైతు అధ్యయన యాత్రలపై సమీక్షించడానికి శనివారం హైదరాబాద్‌లో జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను కోదండరాం మీడియాకు వెల్లడించారు. తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో రైతు అధ్యయన యాత్రలు పూర్తయ్యాయని, ఇంకా మిగిలిఉన్న ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేస్తామన్నారు.

22వ తేదీ నుంచి 30వ తేదీ దాకా జిల్లాల వారీగా జరిగిన అధ్యయన యాత్రల్లో వచ్చిన అంశాలపై సమీక్షా సమావేశాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు. జిల్లా స్థాయి సదస్సులు పూర్తయిన తరువాత విçస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జేఏసీ నేత గోపాలశర్మ అరెస్టుపైనా సమీక్షించినట్టుగా కోదండరాం వెల్లడించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top