బెస్ట్‌ సీఎం వైఎస్‌ జగన్‌

Vasantha Nageswara Rao Article On YS Jagan - Sakshi

అభిప్రాయం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేవలం 9 నెలల పరి పాలనా కాలంలోనే సమర్థవంతమైన సీఎంగా ప్రజల మన్ననలు పొందారు. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సీఎం జగన్‌ పాలనా తీరులను నిశితంగా పరిశీలించటం, సంతృప్తిని వ్యక్తం చేయటం శుభపరిణామం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్‌ పరిపాలనా అడుగులకు వేగం పెంచటం మనకు తెలిసిందే. గత ప్రభుత్వం ఖర్చు చేసిన అనవసరపు ఆర్థిక దుబారాను పూర్తిగా తగ్గించారు. రీటెండరింగ్‌ విధానం ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ. 1,800 కోట్లు ఆదా చేశారు. ఆర్థికస్థితి మెరుగుకు మద్యం అమ్మకాలలో ప్రభుత్వ ఫాలసీ తీసుకు వచ్చారు. ఏ నవరత్నాలను నమ్మి ప్రజలు ఓట్లేశారో... ఆ నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. 

ఇప్పటికే దాదాపు 80 శాతం హామీలను అమలు చేశారు. రైతుల బుణాల మాఫీ, అమ్మఒడి, ఇంగ్లీషు విద్య, నాడు నేడు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఉద్యోగాల కల్పన, ప్రభుత్వంలోకి ఆర్టీసి ఉద్యోగుల విలీనం, ఆశావర్కర్ల, అంగన్‌వాడీల జీతాలు పెంపు, ఆటోడ్రెవర్లకు, న్యాయవాదులకు ఆర్థిక వెసులుబాటు, 25 లక్షల ఇళ్ళ జాగాలు, అన్ని కులాల వారికి కార్పోరేషన్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపులను లేకుండా చేశారు. ఒకవైపు పలుమార్లు ఢిల్లీలోని ప్రధాని మోదీ, అమిత్‌షాలతో రాష్ట్రఆర్థిక స్థితిగతులపై విన్నపాలు ఇస్తునే, విభజన హామీలు, పోలవరం నిధులు, ప్రత్యేక హోదా వంటి అంశాల సాధనలో వెనుకడుగు వేయటం లేదు. ఇలాంటి ప్రభుత్వ అనుకూల వైఖరి నేప«థ్యంలో మరోమారు జగన్‌ సంస్థాగత తీర్పు కొరకు ప్రజల వద్దకు వచ్చారు. ఇక్కడొక సందర్భాన్ని అందరూ గుర్తుకు తెచ్చుకోవాలి.

భుత్వం రిజర్వేషన్‌లను పెంపు చేసిన నేపధ్యంలో ఢిల్లీ, హైకోర్టుల ఆదేశాల మేరకు ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపును వెనక్కితీసుకొని సంస్థాగత ఎన్నికలకు రెడీ అయ్యారు. చంద్రబాబు 34 శాతంగా ఉన్న బీసీల రిజర్వేషన్లను జగన్‌ 24 శాతానికి తగ్గించారని మీడియాలో విమర్శ చేస్తే, ముఖ్యమంత్రి జగన్‌ తగ్గిన 10 శాతం పార్టీ పరంగా ఇచ్చేలా పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. నాలుక కరుచుకొని తానూ పార్టీ పరంగా బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించారు సంస్థాగత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోలేక పోయిన మంత్రులు అటు నుంచి అటే రాజ్‌భవన్‌కు వెళ్ళి తమ మంత్రి పదవులకు రాజీనామాలు ఇవ్వాలని సూత్రప్రాయంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి జగనొక్కరే. ఎమ్మెల్యేలను మళ్ళీ అసెంబ్లీ టికెట్లు ఆశించవద్దు అనీ తేల్చి చెప్పారు. ఇలాంటి గట్స్‌ ఉన్న నిర్ణయాలు తీసుకోవటంలో బహుశా ఆయనకే పేటెంట్‌æరైట్స్‌ ఉన్నాయనీ భావించొచ్చు. జగన్‌ తీసుకుంటున్న స్తూర్తిదాయకమైన రాజకీయ నిర్ణయాలను నేను ఎప్పడూ చూసి ఉండలేదు. 

రాష్ట్రంలో జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీఆర్, నేదురుమిల్లి, వైఎస్సార్‌ రోశయ్య, నల్లారి,  ఇలా ఉద్దండుల పాలనలను చూశాను. వారి పాలనల్లో నా వంతు భాద్యతలనూ నెరవేర్చాను. మరెందరో కేంద్ర మంత్రులతో, రాష్ట్రమంత్రులతో సావాసం చేశాను. ప్రజలకు ఏం కావాలో, ఏం కోరుకుంటారో, బాగా ఎరిగిన జగన్‌ తన పాలనంతా ప్రజాసంక్షేమం బాటనే పట్టించారు. పైగా ప్రజలు కూడా పరిపాలకుల నుండి సంతృప్తికరమైన పాలనను పూర్తి స్థాయిలో పొందలేదు. అందువల్ల సీఎం జగన్‌ కాలయాపన లేకుండా తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాల పట్ల ప్రజలు తమ ఆమోదాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారనే  అందరం ఒప్పుకోవాలి.


వసంత నాగేశ్వరరావు

(వ్యాసకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ హోం మంత్రి, మొబైల్‌ : 99494 11779)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top