
సాధారణంగా కవల పిల్లలంటే పావుగంటో, అరగంటో మహా అయితే గంటో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. కానీ, వీరిద్దరిలో ఒకరు 2017లో పుడితే, మరొకరు 2018లో పుట్టారు. అయినా, వీరిద్దరూ కవలలే అయ్యారు మరి. అదెలాగంటారా? ఒకరు 2017 డిసెంబర్ 31 రాత్రి 11 గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పుడితే, మరొకరు 2018 జనవరి 1 న 12 గంటల పదహారు నిమిషాలకు పుట్టారు. దాంతో వారిద్దరికీ ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్‌లలో సంవత్సరం తేడా వచ్చేసింది.
అయినా కానీ వారిద్దరూ కవలలే... అందులో కాదనడానికి ఏం లేదు. తల్లిదండ్రులు వీరిని చూసి మురిసిపోతున్నారు. శాండియాగోకు చెందిన మేరియాకి మొదటి బాబు జో ఆక్విన్ జూనియర్ పుట్టిన కొద్దిసేపటికి చెల్లెలు ఐతనా జీసస్ పుట్టింది. ఈ కొద్దిసేపటిలోనే క్యాలెండర్ మారిపోవడంతో అమ్మ మురిసిపోతూ, ఫేస్‌బుక్‌లో వారిద్దరి ఫొటోలు షేర్ చేసింది. అది కాస్తా వైరల్ అయింది.