అదేపనిగా కూర్చుంటే..

New Study Suggests Sitting For Too Long May Even Boost The Risk Of Dementia - Sakshi

లండన్‌ : ఎక్కువ సేపు డెస్క్‌ పనుల్లో కుర్చీలో కూరుకుపోవడం, సోఫోకు అతుక్కుని టీవీ చూడటంలో నిమగ్నమవడం తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు తక్కువగా ఉన్నవారి మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసకునే ప్రదేశం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చిచెప్పారు. ఎక్కువ గంటలు కూర్చునే వారికి పెనుముప్పు తప్పదని అథ్యయనాన్ని చేపట్టిన లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు.

బద్ధకంగా గడిపే వారికి గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల క్యాన్సర్లు వంటి జీవన శైలి వ్యాదులు ముంచుకొస్తాయని ఇప్పటికే వెల్లడవగా తాజా అథ్యయనం మరికొన్ని వ్యాధులూ చురుకైన జీవన శైలి లేని వారిని చుట్టుముడతాయని పేర్కొంది. వీరి మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకునే ప్రదేశం చిన్నగా ఉండటంతో అల్జీమర్‌, డిమెన్షియా వంటి వ్యాధులు ప్రబలవచ్చని తెలిపింది. అల్జీమర్‌ ముప్పు అధికంగా ఉన్న వారిలో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చురుకైన జీవనశైలిని అలవరుచుకోవడం కీలకమని బయోస్టాటిస్టీషియన్‌ డాక్టర్‌ ప్రభా సిద్ధార్ధ్‌ సూచించారు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top